చిన్న చిత్రాల విడుదల గగనంగా ఉంది

Dec 28,2023 19:05 #movie

తమిళనాడు వైద్యుడు కె.వీరబాబు సొంతంగా నిర్మించి, హీరోగా నటించిన చిత్రం ‘ముడకరుత్తాన్‌’. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుక తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఇందులో ఓ చిన్న పాత్రలో నటించిన సముద్రఖని, ఆడియో విడుదల కార్యక్రమంలో చిన్న సినిమాలకు ఆదరణ లభించడం లేదన్న విషయంపై ఆవేదన చెందారు. ‘ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు వీరబాబు నన్ను సంప్రదించి వుంటే కచ్చితంగా సినిమా నిర్మాణంలో దిగవద్దనిచెప్పేవాడిని. ఇప్పుడు చిన్న చిత్రాలను విడుదల చేయడం గగనంగా మారింది. అనేక చిత్రాలు విడుదలకు నోచుకోలేని పరిస్థితి ఉంది’ అని అన్నారు. చెన్నై, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో ట్రాఫిక్‌ సిగళ్ల వద్ద భిక్షాటన చేసే చిన్నారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను సిద్ధం చేశారు.

➡️