టికెట్‌ ధరలు తగ్గించారు

Feb 6,2024 19:05 #movie, #raviteja

రవితేజ నటించిన ‘ఈగల్‌’ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ధరలు తగ్గించినట్లు ప్రకటించింది. తెలంగాణ మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150కే ఈ చిత్రం టికెట్‌ ధరలను పరిమితం చేసింది. అగ్ర హీరోల సినిమాలు విడుదల అప్పుడు సాధారణ ధరల కంటే మల్లీప్లెక్స్‌లలో రూ.295 నిర్ణయిస్తారు. కానీ ఈ సినిమాకి తగ్గించారు. అనుపమా పరమేశ్వరన్‌, కావ్యా తాపర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాని కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

➡️