డ్రిల్‌ మూవీ టీజర్‌ విడుదల

Feb 8,2024 19:10 #movie

డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌పై దర్శక నిర్మాత, కథానాయకుడు హరనాథ్‌ పొలిచెర్ల రూపొందించిన చిత్రం డ్రిల్‌. కారుణ్య చౌదరి, భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లోనూ; తనికెళ్ల భరణి, రఘుబాబు, జెమినీ సురేష్‌, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబర్దస్త్‌ ఫణి ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఈనెల 16న సినిమా విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్‌ దీని టీజర్‌ను విడుదల చేశారు. అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన హరనాథ్‌ పొలిచెర్ల దేశానికి వచ్చి ఎంతోమంది ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తూ తెలుగు సినిమాలు చేయటం అభినందనీయమని అన్నారు. హరనాథ్‌ మాట్లాడుతూ కెప్టెన్‌ రాణాప్రతాప్‌, టిక్‌ టిక్‌, చంద్రహాస్‌ తదితర ఎనిమిది సినిమాలు తీసినట్టు చెప్పారు.

➡️