బెంగుళూరులో తీవ్ర నీటి ఎద్దడిపై తెలుగు హీరో చిరంజీవి చేసిన ట్వీట్ తాజాగా వైరల్‌గా మారింది. నీటి సంక్షోభం నుంచి బయట పడేందుకు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో అవలంబించిన పద్ధతులను ఆయన వివరించారు. ఇంకుడుగుంతల ఫొటోలను పంచుకున్నారు. కన్నడ భాషలో తన ట్వీట్‌ను రాశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది.