‘పా..పా’ మూవీ ట్రైలర్‌ విడుదల

Mar 8,2024 19:23 #kavin, #movie

తమిళ సినిమా ‘దా..దా..’ను తెలుగులో త్వరలో ‘పా..పా..’గా ఆ చిత్ర బృందం విడుదల చేయనుంది. కవిన్‌, అపర్ణదాస్‌, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్‌, విటివి గణేష్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. గణేష్‌ కె.బాబు దర్శకత్వంలో ఎస్‌ అంబేత్‌కుమార్‌ సమర్పణలో తమిళంలో నిర్మించారు. తెలుగులో నీరజ సమర్పణలో పాన్‌ ఇండియా మూవీస్‌, జెకె ఎంటర్‌టైర్‌మెంట్స్‌పై నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన చేతుల మీదుగా నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి విడుదల చేశారు.

➡️