‘పుష్ప – ది రోర్‌’ గా పార్టు 3

Mar 28,2024 19:15 #allu arjun, #movie

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప సినిమా హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికిగాను హీరో, సంగీత దర్శకుడు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారు. తాజాగా ఈ కథ మూడో పార్టుకు పుష్పా3కి ‘పుష్ప ది రోర్‌’ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా సమాచారం. మొదటి భాగాన్ని ‘పుష్ప : ది రైజ్‌’తో ప్రారంభించిన చిత్రబృందం దానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ పార్ట్‌ా2గా రూపొందిస్తున్నారు. తర్వాత ‘పుష్ప: ది రోర్‌’ పేరుతో పార్ట్‌ా3 తెరకెక్కించి కథను ముగించనున్నారని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్‌, సుకుమార్‌ పార్ట్‌ా3పై స్పందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్ట్‌ 2 షూటింగ్‌ జరుగుతోంది. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది.

➡️