ప్రభాస్‌- మారుతి కాంబో మూవీ ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ రిలీజ్‌

Dec 30,2023 08:33 #movie, #prabhas

ఈసంక్రాంతి రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కు రెట్టింపు సంతోషాన్ని తీసుకురాబోతోంది. ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతి కాంబినేషన్‌ లో రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ ను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ ఇప్పటిదాకా చూడని ఒక కొత్త లుక్‌ లో, క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నారు. ప్రభాస్‌ తో చేస్తున్న ఈ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ గురించి నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అప్డేట్‌ ను షేర్‌ చేసింది. డైనోసార్‌ డార్లింగ్‌ గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి. సంక్రాంతి రోజున ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ అనౌన్స్‌ చేస్తున్నాం. అంటూ ఈ సంస్థ ట్వీట్‌ చేసింది.ప్రభాస్‌, మారుతి మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో ఉన్నా..ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ ఏదీ రాలేదు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ ప్రకటన రావడంతో రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూఛిబట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

➡️