‘మనమే’లో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

Mar 28,2024 19:23 #movie, #sarvanandh

హీరో శర్వానంద్‌ నటిస్తున్న 35వ చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ నిర్మించారు. కృతిశెట్టి హీరోయిన్‌. వివేక్‌ కూచిభట్ల సహ నిర్మాత. కృతి ప్రసాద్‌, ఫణివర్మ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు. ఏడిద రాజా అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ఇక నా మాట’ పాటను చిత్రబృందం విడుదల ద్వారా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. కృష్ణచైతన్య రాసిన పాటకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతాన్ని అందించారు. లండన్‌లోని అద్భుతమైన ప్రదేశాల్లో విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్‌ చిత్రీకరించారు. శాస్త్రి వర్మ కొరియోగ్రఫీ చేశారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ విక్రమ్‌ ఆదిత్య కీలకపాత్రలో నటిస్తున్నాడు.

➡️