మహేష్‌ ప్రాజెక్టు ఓపెనర్‌గా జేమ్స్‌కామెరాన్‌

Feb 27,2024 19:23 #maheshbabu, #movie

హీరో మహేష్‌బాబు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబి 20 ప్రాజెక్టుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇందులో నటీనటుల పాత్రలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హాలీవుడ్‌ సన్షేషనల్‌ డైరెక్టర్‌ జేమ్స్‌కామెరాన్‌ ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హైద రాబోతున్నట్లుగా సమాచారం. దేశంలోనే క్రేజీ ప్రాజెక్టుగా చెబుతున్న ఈ సినిమా విషయాలపై జాతీయస్థాయి మీడియాను కూడా తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై పలు అంతర్జాతీయ వేదికలపైన కామెరాన్‌ ప్రస్తావించిన విషయం తెలిసిందే.

➡️