మేము కలిసే ఉన్నాం : శుభలేఖ సుధాకర్‌

Feb 17,2024 19:23 #movie, #subhaleka sudhakar

తాను తన భార్య ఎస్‌పి శైలజ కలిసే ఉన్నామని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శుభలేఖ సుధాకర్‌ చెప్పారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం సోదరే శైలజ. సుధాకర్‌ నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా యాత్ర -2 సినిమాలో ఆయన నటించారు. తాజాగా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ‘సుధాకర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని చిరంజీవి, ‘శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్‌’ వంటి కథనాలు రావటంతో ఆయన స్పందించారు. శైలజ తాను ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామన్నారు. కావాలనే కొందరు తమపై లేనిపోని కథనాలు సృష్టిస్తూ మనోవేధనకు గురిచేస్తున్నారన్నారు.

➡️