యువతను ఆకట్టుకునేలా ‘నీ దారే నీ కథ’

Mar 21,2024 19:23 #movie, #tejas veera

”ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ముగ్గురు కొత్త వాళ్లు అంతా కొత్త టీంతోనే యువతను ఆకట్టుకునేలా ‘నీదారే నీ కథ’ సినిమాను తీశాం. ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా రూపొందించాం.” అని నిర్మాత తేజేష్‌ వీర వెల్లడించారు. జెవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడు తేజేష్‌ వీర, శైలజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియతమ్‌ మంతిని, అంజన, విజయ్, అనంత్‌, వేద్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా టీజర్‌ విడుదల తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మీనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు ప్రభు, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ చేతుల మీదుగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

➡️