రాజకీయాల్లోకి వచ్చేది లేదు : ప్రశాంత్‌

Mar 2,2024 07:59 #movie, #prasanth

ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్ధేశ్యం లేదని హీరో ప్రశాంత్‌ స్పష్టంచేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్‌ చేసేటప్పుడు విధిగా హెల్మెట్‌ ధరించాలని అవగాహన కల్పిస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు. తిరునెల్వేలి, తూత్తుక్కుడి జిల్లాల్లో పర్యటించి అభిమానులను కలుసుకున్నారు. రాజకీయాల సంగతి పక్కని పెడితే నటుడిగా ప్రజలకు ఏమి చేయగలనో అదే చేస్తానని అన్నారు. ప్రస్తుతం ‘గోట్‌’ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు.

➡️