వయసుకు తగ్గ పాత్రలోషారుక్‌ ఖాన్‌

Dec 23,2023 09:07 #movie, #sharuk khan

‘డంకీ’ తర్వాత చేయనున్న సినిమాపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ‘ఈసారి కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నా. నా వయసుకు తగిన పాత్ర చేయనున్నా. అది అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. అయితే, ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అట్లీ దర్శకత్వంలో షారుక్‌-విజరుల కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలయ్యాయి. షారుక్‌ ఖాన్‌ చెప్పిన ప్రాజెక్ట్‌ ఇదా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆయన మరికొందరు దక్షిణాది దర్శకుల నుంచి కూడా కథలు వింటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతోపాటు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ సినిమాను ప్రకటించారు. ఇది 2025లో ప్రారంభించనున్నారు. దీనికంటే ముందే షారుక్‌ ఓ సినిమా చేసే అవకాశం ఉంది.

➡️