వేసవికి ‘లవ్‌ గురు’

Feb 3,2024 19:10 #movie, #vijay antoni

హీరోగా విజయ్ ఆంటోనీ, హీరోయిన్‌గా మృణాళిని రవి కలిసి నటిస్తున్న చిత్రం ‘లవ్‌గురు’. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌ ద్వారా ఈ సినిమా నిర్మిస్తున్నారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భార్యాభర్తల మధ్య రోజువారీ జీవితంలో జరిగే సంఘటనల ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర ప్రతినిధులు తెలిపారు.

➡️