‘షరతులు వర్తిస్తాయి’ సాంగ్‌ విడుదల

Mar 7,2024 19:20 #chaithanyarao, #movie

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి ‘ఆకాశమే అందనీ..’ అంటూ సాగే పాట విడుదలైంది. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన లిరికల్‌ సాంగ్‌ తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ పాటకు చైతన్య పింగళి లిరిక్స్‌ అందించారు. నరేష్‌ అయ్యర్‌, నయన నాయర్‌ పాడారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అరుణ్‌ చిలువేరు కంపోజ్‌ చేశారు.

➡️