సలార్‌తో నా కల నెరవేరింది

Dec 16,2023 19:20 #move, #prudwiraj

‘సెట్‌లో ప్రతి ఒక్కరి మంచి కోసం మాత్రమే ప్రభాస్‌ చూస్తారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చూస్తారు. మంచి భోజనం తెప్పిస్తారు. అందుకే ఆయన అభిమానులు తనను డార్లింగ్‌ అని పిలుస్తారని ఈ షూటింగ్‌ సమయంలో నాకు అర్థమైంది. ఈ సినిమాతో నా కల నెరవేరింది’ అని మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అన్నారు. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌’. ఈనెల 22న ఈ సినిమా విడుదల కానుంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హీరో ప్రభాస్‌, సలార్‌ సినిమా గురించి వివరించారు. ‘సలార్‌ సినిమా కథను నేను వినలేదు.. స్క్రిప్ట్‌ కూడా చదవలేదు. ఈ ప్రాజెక్ట్‌లోకి నాకు అవకాశం దక్కడం చాలా సంతోషం. ఇందులో నా పాత్ర సెకండరీ అయినప్పటికీ మంచి సినిమాలో నటించటం చాలా గొప్పగా భావిస్తున్నాను. వరదరాజ మన్నార్‌ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. అది ఫలించిందని నమ్ముతున్నాను’ అని వివరించారు.

➡️