సేవ్‌ ద టైగర్స్‌ 2 ట్రైలర్‌ రిలీజ్‌

Mar 2,2024 19:20 #movie

వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ద టైగర్స్‌’ సీజన్‌ 2 ట్రైలర్‌ను దర్శకుడు మహీ వి.రాఘవ్‌ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ్‌ ద టైగర్స్‌కు సెకండ్‌ సీజన్‌ అనౌన్స్‌ చేయటం థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నామన్నారు. మొదటి సీజన్‌కు మించిన హ్యూమర్‌, సస్పెన్స్‌, ఫన్‌ను సీజన్‌ 2లో అందించబోతున్నామన్నారు. ఈనెల 15 నుంచి డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతోంది. మహి వి.రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతం ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. అరుణ్‌ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్‌ సుజాత, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్‌కపూర్‌, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్‌, హర్షవర్థన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

➡️