‘హద్దు లేదురా’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

Dec 10,2023 17:58 #movie

టైగర్‌ హిల్స్‌ ప్రొడక్షన్‌, స్వర్ణ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన నూతన చిత్రానికి ”హద్దు లేదురా..” అనే టైటిల్ని ఖరారు చేశారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మాతగా, రావి మోహన్‌ రావు సహా నిర్మాతగా, యువ దర్శకుడు రాజశేఖర్‌ రావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.టైటిల్‌ విడుదల సందర్భంగా డైరెక్టర్‌ క్రిష్‌ మాట్లాడుతూ.. హద్దు లేదురా.. టైటిల్‌ చాలా బాగా వుందని, ఫస్ట్‌ లుక్‌ సినిమా థీమ్‌ వైవిధ్యంగా ఉందని, తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని అన్నారు..

➡️