‘హనుమాన్‌’ ట్రైలర్‌ విడుదల

Dec 19,2023 19:10 #movie, #teja

తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ‘హనుమాన్‌’ సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. తమ్ముడి కోసం అక్క వరలక్ష్మి అడ్డు నిలవడం వంటి కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో కట్‌ చేసి, సినిమాపై ఆసక్తి కలిగించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్‌ కథానాయిక కాగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వినరు రారు విలన్‌గా చేస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 12న తెలుగు సహా పలు భారతీయ, విదేశీ భాషల్లో విడుదలవుతోంది.

➡️