‘హిట్లర్‌’ టీజర్‌ రిలీజ్‌

Dec 27,2023 19:05 #movie, #vijay antoni

విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హిట్లర్‌’. చెందూర్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్‌ సంజరు కుమార్‌ నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది. డిక్టేటర్‌ లాంటి ఒక రాజకీయ నాయకుడు, అతన్ని వేటాడే ఓ కిల్లర్‌, ఆ ప్లాన్‌ను అడ్డుకుని, కిల్లర్‌ను టార్గెట్‌ చేసిన ఓ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌.. ఈ మూడు పాత్రలను పరిచయం చేస్తూ టీజర్‌ సాగింది. కిల్లర్‌గా విజరు ఆంటోనీ కొత్త లుక్‌, క్యారెక్టరైజేషన్‌లో కనిపించారు. హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవ్వబోతోంది.

➡️