10న ఆస్కార్‌ అవార్డుల వేడుక

Mar 6,2024 19:30 #askar award, #movie

ప్రపంచంలోనే సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్‌ 96వ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఈనెల 10న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో జరగనుంది. హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్‌ నాల్గోసారి ఈ వేడుకల నిర్వహణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ కార్యక్రమాన్ని లైవ్‌ ద్వారా వీక్షించవచ్చు. మనదేశ కాలమాలం ప్రకారం… సోమవారం ఉదయం 4 గంటలకు ఆస్కార్‌ వేడుకను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు డిస్నీ ఫ్లస్‌ హాట్‌స్టార్‌ ప్రకటించింది. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలతో వీడియోను షేర్‌ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌, ఓపెన్‌ హైమర్‌, బార్బీ, మాస్ట్రో, పూర్‌ థింగ్స్‌, అమెరికన్‌ ఫిక్షన్‌ వంటి సినిమాలు పోటీ పడుతున్నాయి.

మనదేశం నుంచి ‘టు కిల్‌ ఎ టైగర్‌’

ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్‌ ఏ టైగర్‌’ చిత్రం నామినేట్‌ అయ్యింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్‌ ఎ టైగర్‌’ ఆస్కార్‌ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది మన దేశానికి రెండు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ‘నాటు నాటు’సాంగ్‌కు, ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ అనే డాక్యుమెంటరీకి ఈ గౌరవం దక్కింది.

➡️