12త్‌ ఫెయిల్‌ రికార్డు

Jan 10,2024 08:30 #movie

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం 12త్‌ ఫెయిల్‌. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. గతేడాది విడుదలైన హాలీవుడ్‌ చిత్రాలకంటే దీని రేటింగ్‌ ఎక్కువగా ఉండటం విశేషం. తాజాగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్‌’ (8.4), బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘స్పైడర్‌ మ్యాన్‌: అక్రాస్‌ది స్పైడర్‌ వెర్స్‌’ (8.6) సినిమాల రేటింగ్స్‌ను దాటి 12త్‌ ఫెయిల్‌ 9.2 సాధించింది. 12వ తరగతి ఫెయిలైన మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఐపిఎస్‌ ఎలా అయ్యాడనే కథతో ఈ సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఆస్కార్‌కు జనరల్‌ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా చిత్ర బృందం నామినేషన్‌ వేసింది.

➡️