23న ‘వ్యూహం’ విడుదల

Feb 9,2024 19:15 #movie, #ramgopal varma

రాంగోపాల్‌ వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. హైకోర్టు సూచనలతో ఈ సినిమాకు రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేశారు. దీంతో ఈ నెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అయినా కొంతమంది కోర్టులో పిటిషన్‌ వేయడంతో విడుదలకు బ్రేక్‌ పడింది. చిత్రనిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో మరోసారి సర్టిఫై చేయాలని, హైకోర్టు, సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. దీంతో సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్‌ను జారీ చేయడంతో విడుదల చేస్తున్నారు.

➡️