నటుడు జయరాం కుమార్తె వివాహం

May 3,2024 18:49 #New Movies Updates

ప్రముఖ నటుడు జయరాం కుమార్తె మాళవిక వివాహం సింపుల్‌గా జరిగింది. నవనీత్‌ గిరిశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌లోని ఓ గుడిలో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులతో పాటు బాగా దగ్గరి బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకురాగా నూతన వధూవరులకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శుక్రవారంనాడు రిసెప్షన్‌ ఏర్పాటు చేయగా సినీ రంగ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. గిరీశ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మలయాళ నటుడైన జయరాం తెలుగు వారికి కూడా బాగా సుపరిచితమే. తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌కు తండ్రి పాత్రలో నటించారు. ‘అల వైకుంఠపురంలో’ అల్లు అర్జున్‌కు తండ్రిగా కనిపించారు.

➡️