హాలీవుడ్‌ నటుడు ఆండ్రీ బ్రౌగర్‌ కన్నుమూత

Dec 13,2023 16:49 #movie

 

న్యూయార్క్‌ : ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆండ్రీ బ్రౌగర్‌ (61) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆండ్రీ డిసెంబర్‌ 11వ తేదీన మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడు జెన్నీఫర్‌ అలెన్‌ మీడియాకు వెల్లడించారు. ఆండ్రీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సోషల్‌ మీడియా ద్వారా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కామెడీ షో బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌లో కెప్టెన్‌ రేమాండ్‌ హాల్ట్‌ పాత్ర, హౌమిసైడ్‌ : లైఫ్‌ ఆన్‌ ది స్ట్రీట్‌లో డిటెక్టివ్‌ ఫ్రాంక్‌ పెంబ్లిటన్‌ పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. కామెడీ సిరీస్‌లో ఆయనకు రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ లభించాయి. అలాగే ఆండ్రీ నాలుగు ఎమ్మీ నామినేషన్స్‌ కూడా స్వీరించారు. ఇక ఆండ్రీ బ్రౌగర్‌ తాను నటిస్తూ తెరకెక్కించిన లవ్‌ సాంగ్స్‌ షోటైం ట్రియాలజీలోనూ కనిపించారు. బ్రౌగర్‌ 1962, జులై 1న చికాగోలో జన్మించారు. బ్రౌగర్‌కు భార్య, నటి అమి బ్రాబ్సన్‌, ముగ్గురు కుమారులున్నారు.

➡️