అనుష్క నటన అంటే నాకిష్టం : రవితేజ

Mar 19,2024 13:46 #movie, #raviteja

ఇంటర్నెట్‌డెస్క్‌ : మాస్‌ మహారాజ్‌ రవితేజ ఇటీవల నటించిన టైగర్‌ నాగేశ్వరరావు, ‘ఈగల్‌’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే సినిమాల హిట్‌తో సంబంధం లేకుండా రవితేజ మాత్రం సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో ఓ హీరోయిన్‌ నటన అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరంటే..?! రవితేజ, అనుష్క జంటగా నటించిన ‘విక్రమార్కుడు’ భారీ హిట్‌ కొట్టింది. ఆ తర్వాత ‘బలాదూర్‌’ మూవీలో కూడా వీరు జత కట్టారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే ప్రముఖ హీరోయిన్‌ అనుష్క నటన తనకెంతో ఇష్టమని రవితేజ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో ఇలియానా, శ్రియ, త్రిష, అనుష్క హీరోయిన్ల పేర్లను ప్రస్తావించగా.. వారిలో అనుష్క నటనే ఇష్టమని రవితేజ చెప్పాడు.

కాగా, త్రిషతో ‘కష్ణ’, ఇలియానా ‘కిక్‌’, శ్రియతో ‘డాన్‌శీను’, ‘భగీరథ’ సినిమాల్లో రవితేజ జత కట్టారు. ఈ సినిమాల్లో కొన్ని ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం రవితేజ ప్రముఖ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాలో రవితేజ నటిస్తున్నారు.

➡️