సాయి పల్లవికి శుభాకాంక్షలు

May 9,2024 19:30 #movie, #sai pallavi

హీరోయిన్‌ సాయిపల్లవి గురువారం నాడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘తండేల్‌’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణమవుతోంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి బర్త్‌ డే కావడంతో తండేల్‌ చిత్ర యూనిట్‌ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్‌ మూవీ సెట్‌లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్‌ వీడియో అద్భుతంగా రూపొందించారు.

➡️