‘భజే వాయు వేగం’ ట్రైలర్‌ విడుదల

May 25,2024 19:46 #movies, #New Movies Updates

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై ‘భజే వాయువేగం’ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘బెదురులంక 2012’ చిత్రం విజయం తర్వాత మరో విభిన్నమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు కార్తికేయ వస్తున్నాడు. ‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. తండ్రీ తనయుల బంధం చుట్టూ మలిచిన సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలంగా ఉండనున్నాయి. ట్రైలర్‌లో కూడా ఆ ఎమోషన్స్‌ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా మే 31న విడుదల కానుంది’ అని వివరించారు.

➡️