పాత్ర నిడివి కన్నా ప్రభావం ముఖ్యం : బాబీ దేవోల్‌

Dec 8,2023 18:41 #Hollywood
boby dabel on animal

”యానిమల్‌ సినిమా చూసిన వారంతా నేను ఇంకా ఎక్కువ సమయం కనిపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటుడిగా ఇది నాకు ప్రశంసతో సమానం. కానీ, సినిమాలో మన పాత్ర నిడివి కంటే దాని ప్రభావం ఎంత అనేది ముఖ్యం.” అని నటుడు బాబీ దేవోల్‌ వ్యాఖ్యానించారు. తన పాత్ర నిడివిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్వీట్లపై ఆయన పై విధంగా స్పందించారు. సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన ‘యానిమల్‌’ సినిమాలో నటుడు బాబీ దేవోల్‌ విలన్‌గా ఆకట్టుకున్నారు. ”సందీప్‌ వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాతో ఆయన నా జీవితాన్ని మార్చేశారు. నాకు పాత్ర గురించి చెప్పి 15 రోజుల షూటింగ్‌ మాత్రమే ఉంటుందని చెప్పారు. నిడివి తక్కువైనా కథాపరంగా ప్రాధాన్యమున్న పాత్ర అది. ఎంతో సవాలుగా అనిపించింది. ఈ స్థాయిలో విజయాన్ని మాత్రం ఊహించలేదు. నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.’ బాబీ పేర్కొన్నారు.

➡️