నల్లగా ఉన్నానన్నారు : రోషన్‌ కనకాల

Dec 25,2023 18:53 #movies

హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. రవికాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోషన్‌ తనపై వచ్చిన ట్రోల్స్‌ గురించి మాట్లాడారు. ‘నల్లగా ఉన్నాడు. వీడు హీరో ఏంటి’, ‘వీడు హీరో మెటీరియల్‌ కాదు’ ఇలా నా గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. నా వెనుక ఇలాంటివి మాట్లాడుతూ ట్రోల్‌ చేశారు. నేను ఇలాగే పుట్టాను. ఇలాగే ఉంటాను. ఒక మనిషి అందం రంగులో ఉండదు. అతడి సక్సెస్‌ను నలుపు, తెలుపు నిర్ణయించవు. అతడి ప్రతిభ, క్రమశిక్షణ, సినిమా కోసం అతడు పడిన కష్టం మాత్రమే విజయాన్ని అందిస్తాయి’ అని రోషన్‌ చెప్పారు.

➡️