మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు

Nov 22,2023 19:30 #Case, #Mansoor Ali Khan, #movie

హీరోయిన్‌ త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిషపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఈ విషయంపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తాను తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా?’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మన్సూర్‌ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం) అతడిని పాక్షికంగా నిషేధించింది. సోషల్‌మీడియాలో త్రిషకు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు.

➡️