‘దర్శిని’ పాటలు బాగున్నాయ్

Apr 13,2024 19:30 #movie, #vikas

వి4 సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఎల్‌వి సూర్యం నిర్మాతగా, డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దర్శిని’. వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్టుతో దీనిని తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌ చిత్రబృందానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. ‘ఈ సినిమాలోని పాటలు, టీజర్‌ చూశాను. చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు.

➡️