Kalki : మూడు ప్రపంచాల కథ

‘కల్కి ‘2898ఎడి’.. ‘కాశీ’, ‘కాం ప్లెక్స్‌’, ‘శంబాలా’ అనే మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ. ఒకొక్క వరల్డ్‌ని ఒకొక్క థాట్‌ ప్రాసెస్‌తో ఫ్యూచరిస్టిక్‌గా తెరకెక్కించాం’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నారు. ప్రభాస్‌ నటిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా గురువారం ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి 2898 ఎడి – ఎపిసోడ్‌ 2’ ని చిత్రబృందం విడుదలచేసింది. దీని గురించి నాగ్‌ అశ్విన్‌ మాట్లాడారు. ‘కాశీ భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్‌ స్టార్ట్‌ చేశాం. కలియుగం చివరలో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్‌ సిటీ ఏముటుందని అనుకుంటే, అలాంటి సమయంలో మన కాశీ వుంటే ఎలా వుంటుంది, నాగరికత పుట్టిందే కాశీలో అలాంటి ఆ సిటీని క్రియేట్‌ చేయడం చాలా ఇంట్రస్టింగా వుంటుంది. ఇండియన్‌ ఆర్కిటెక్చర్‌, వెహికిల్స్‌, కరెన్సీ ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్‌గా కాశీని నిర్మించడం మొదలుపెట్టాం. ఇది చాలా లాంగ్‌ ప్రాసెస్‌. కాశీపైన పిరమిడ్‌ ఆకారంలో ఉండే స్ట్రక్చర్‌ వుంటుంది, దాన్ని మేము కాంప్లెక్స్‌ అంటాం. భూమిపై లేని నేచర్‌, యానిమల్స్‌, ఫుడ్‌, ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్‌ కూడా వుంది. అదే ‘శంబాల’. ఇది కల్కి స్టొరీకి ఇంటిగ్రల్‌గా వుంటుంది. కాశీకి కాంప్లెక్స్‌కి సంబంధం లేని థర్డ్‌ వరల్డ్‌. ఈ వరల్డ్‌ వున్న వారు కాంప్లెక్స్‌లో వున్నవారిని ఛాలెంజ్‌ చేస్తుంటారు. ఈ వరల్డ్‌లో గాడ్‌ అనే ఐడియా వుండదు. గాడ్‌ని బ్యాన్‌ చేసిన వరల్డ్‌. ఈ మూడు వరల్డ్స్‌ మధ్య మన కథ నడుస్తుంది. ఒకొక్క వరల్డ్‌ని ఒకొక్క థాట్‌ ప్రాసెస్‌తో డిజైన్‌ చేశాం. కాశీలో ప్రజలు, వెహికిల్స్‌, కరెన్సీ, ఫుడ్‌, వెపన్స్‌ ఒకలా వుంటాయి. కాంప్లెక్స్‌లో ఒకలా వుంటాయి. శంబాలా కంప్లీట్‌ డిఫరెంట్‌. ఒకొక్కరు ఒక్కో కల్చర్‌. శంబాలాలో దేవుడు మళ్ళీ పుడతాడనే ఒక నమ్మకం వుంది. కల్కి అవతారం శంబాలాలో పుడుతుందనే నమ్మకం మన పాపులర్‌ కల్చర్‌లో వుంది. ఈ మూడు వరల్డ్స్‌ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది’ అని చిత్ర విశేషాలు ముచ్చటించారు.

➡️