రూమర్స్‌ను నమ్మకండి .. కెప్టెన్‌ విజయ్ బావున్నారు : భార్య క్లారిటీ

Dec 1,2023 13:08 #cinema

తమిళనాడు : ” రూమర్స్‌ను నమ్మకండి .. కెప్టెన్‌ విజయ్ బావున్నారు” అని హీరో విజయకాంత్‌ భార్య క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్‌ సీనియర్‌ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్‌ కొద్ది రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి విజయకాంత్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఉదయం విజయకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. అందులో .. ”విజయకాంత్‌ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారు.. కానీ గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నాం. విజయకాంత్‌ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని” వైద్యులు తెలిపారు.

తప్పుడు వార్తలు ….

ఈ నేపథ్యంలో … విజయకాంత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌లో విజయకాంత్‌ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని విజయకాంత్‌ భార్య ప్రేమలత స్పష్టం చేశారు.

విజయకాంత్‌ భార్య క్లారిటీ …

” కెప్టెన్‌ విజరు బావున్నారు. ఆయన చనిపోలేదు. రూమర్స్‌ ను నమ్మకండి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకొని త్వరలోనే ఇంటికి వస్తారు. అప్పటివరకు ఇలాంటి వార్తలను నమ్మకండి” అని ప్రేమలత చెప్పడంతో విజయకాంత్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తూ స్పందిస్తున్నారు.

➡️