‘ఈగల్‌’.. సంక్రాంతికి లేదు

Jan 4,2024 19:06 #movie, #raviteja

సంక్రాంతి సినిమాల జాబితా నుంచి ‘ఈగల్‌’ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు నేతృత్వంలో కొన్ని రోజులుగా చిత్ర నిర్మాతలతో చర్చలు నడుస్తున్నాయి. వరుసగా ఐదు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ‘ఈగల్‌’ విడుదల వాయిదా పడింది. ఇది జనవరి 26న వస్తున్నట్టుగా సమాచారం. అదే రోజు రవి తేజ పుట్టినరోజు కావటం, రిపబ్లిక్‌ దినోత్సవం కూడా కావడంతో ‘ఈగల్‌’ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరికేటట్టుగా చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ చిత్ర నిర్మాతలు వెనక్కి తగ్గారు.

➡️