‘ఫ్యామిలీ స్టార్‌’ పూర్తి చేశారు

విజరు దేవరకొండ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. శనివారంతో తమ మూవీ షూట్‌ మొత్తం పూర్తి అయిందని హీరో విజరు దేవరకొండ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

➡️