తండ్రైన హీరో నిఖిల్‌

Feb 21,2024 16:02 #movie, #nikhil, #nikhil hero

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరో నిఖిల్‌ తండ్రయ్యాడు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్‌ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో నెటిజన్లు నిఖిల్‌కి కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

కాగా, నిఖిల్‌, పల్లవిలది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2020లో ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిల్‌ ‘కార్తికేయ 2’ సినిమాలో నటిస్తున్నారు. మరో పాన్‌ ఇండియా మూవీ ‘స్వయంభు’ చిత్రంలో నటిస్తున్నారు.

➡️