టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ

Dec 23,2023 09:06 #movie, #nagarjuna

నాగార్జున నటిస్తున్న ‘నా సామిరంగా’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్రస్తుతం భారీ సెట్‌ వేసి టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటలో అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ సహా 300 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. దినేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానరుపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకుడు.

➡️