దుబాయ్ : తెలుగు మూవీ అవార్డ్స్ ‘గామా’ 4వ ఎడిషన్ అవార్డుల వేడుక మార్చి 3వ తేదీన దుబాయ్ లోని జబిల్ పార్క్లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీతారలు పాల్గొని సందడి చేశారు. గడచిన మూడేళ్లు (2021, 2022, 2023)లో విడులైన సినిమాలు, వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులను గామా అవార్డుల ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు అవార్డుల విజేతలకు అందజేశారు. ఈ వేడుకకు హీరోలు మంచు మనోజ్, నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్, తేజ సజ్జ, ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు డింపుల్ హయతి, సంయుక్తా మీనన్, దక్ష నగార్కర్, ఆషిక రంగనాథ్, నేహాశెట్టి, ఫరియ అబ్దుల్లాలు హాజరయ్యారు.
2021
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి – ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)
ఉత్తమ దర్శకుడు- సుకుమార్ (పుష్ప)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ – దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
2021లో అత్యంత ప్రజాదరణ పొందిన పాట- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)
ఉత్తమ గాయకుడు- ధనుంజరు (నా మది నీదే)
ఉత్తమ గాయని – ఎంఎల్ శతి (అడిగా అడిగా)గామా బెస్ట్ పాపులర్ సాంగ్ – మౌనిక యాదవ్ (సామి నా సామి – పుష్ప)
మూవీ ఆఫ్ ది ఇయర్ – పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ – యలమంచిలి రవి, నవీన్ యెర్నేని)
2022
ఉత్తమ నటుడు – నిఖిల్ (కార్తికేయ 2)
ఉత్తమ నటి – మణాల్ ఠాకూర్ (సీతా రామం)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్- డింపుల్ హయతి (ఖిలాడి)
మూవీ ఆఫ్ ది ఇయర్ – సీతా రామం (వైజయంతి మూవీస్)
ఉత్తమ దర్శకుడు – హను రాఘవపూడి (సీతా రామం)
గామా జ్యూరీ ఉత్తమ నటుడు – విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్)
ఉత్తమ ఆల్బమ్ – సీతారామం (విశాల్ చంద్రశేఖర్)
ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (శ్యామ్ సింగరారు)
ఉత్తమ గాయని – హారిక నారాయణ (ఆచార్య)
2023
ఉత్తమ నటుడు – ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి – సంయుక్త (విరూపాక్ష)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ – ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)
బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ – తేజ సజ్జా (హను-మాన్)
మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ – టీజీ విశ్వప్రసాద్)
ఉత్తమ దర్శకుడు – బాబీ (వాల్తేరు వీరయ్య)
గామా జ్యూరీ ఉత్తమ నటుడు – సందీప్ కిషన్ (మైఖేల్)
ఉత్తమ విలక్షణ నటుడు – మురళీ శర్మ
మరికొన్ని అవార్డులు…
గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు – డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
గామా స్పెషల్ జ్యూరీ అవార్డు – ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
గామా గౌరవ్ సత్కర్ – చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)
ఉత్తమ సంగీత దర్శకుడు – హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి)
ఉత్తమ గేయ రచయిత – కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి… దసరా సినిమాలో పాట)
అత్యంత ప్రజాదరణ పొందిన పాట – పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)
గామా గద్దర్ మెమోరియల్ అవార్డు – జానపద గాయకుడు ‘నల్లగొండ గద్దర్’ నరసన్న
గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ – ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం)
గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ – నక్కిలీసు గొలుసు (రఘు కుంచె)
ఉత్తమ గాయకుడు- రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం – దసరా)
ఉత్తమ గాయని – చిన్మయి (ఆరాధ్య – ఖుషి)