నేను బాగానే ఉన్నాను..

అమితాబ్‌ బచ్చన్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. అనారోగ్య కారణంగా శుక్రవారం అమితాబ్‌ ముంబై కోకిలబెన్‌ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలలో ఎటువంటి నిజమూ లేదనీ అమితాబ్‌ స్పష్టం చేశారు. ‘ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌’కు హాజరైన ఆయన్ని అక్కడ మీడియా ప్రతినిధులు ఆరోగ్యం ఎలా ఉందని అడగడంతో.. ‘నేను బాగానే ఉన్నాను. నా అనారోగ్యంపై వచ్చినవన్నీ తప్పుడు వార్తలు..” అని సమాధానం ఇచ్చారు. ప్రీమియర్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అమితాబ్‌ చాలా హుషారుగా కనిపించారు.

➡️