‘మంజుమ్మాళ్ బాయ్స్’ పై ఇళయరాజా ఫిర్యాదు

May 23,2024 12:26 #Copy Right, #Ilayaraja, #movies

చెన్నై : మంజుమ్మాళ్ బాయ్స్ నిర్మాతలపై సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. సినిమాలో ఉపయోగించిన ‘కణ్మణి అన్పోత్ కథలన్’ పాట తన పని అని, చిత్ర బృందం అనుమతి లేకుండానే ఉపయోగించారని తెలుపుతూ ఇళయరాజా లాయర్ నిర్మాతలకు నోటీసు పంపారు. టైటిల్ కార్డ్‌లో పేర్కొన్నంత మాత్రాన సరిపోదని పేర్కొంటూ లాయర్ నోటీసు పంపారు. 15 రోజుల్లోగా పరిహారం ఇవ్వాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1991లో కమల్ హాసన్ హీరోగా  సంతాన భారతి దర్శకత్వంలో గుణ చిత్రం కోసం ఇళయరాజా  స్వరపరిచిన ‘కణ్మణి అన్పోత్ కథలన్’ పాటను చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమల్ బాయ్స్‌లో వివిధ చోట్ల ఉపయోగించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో, ఓటిటిలో కూడా భారీ హిట్ కావడంతో 220 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  గుణ కేవ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్ మరియు విష్ణు రఘు ప్రధాన పాత్రలు పోషించారు.

➡️