ఓటీటీలో ‘జపాన్‌

Dec 4,2023 20:01 #New Movies Updates

‘కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘జపాన్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. రాజు మురుగన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించారు. కార్తి సినిమా కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 11 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ నటుడు సునీల్‌ కీలక పాత్ర పోషించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు.

➡️