Kalki movie : అత్యధిక వసూళ్లతో అమెరికాలోనూ రికార్డు సృష్టించిన కల్కి

Jul 1,2024 12:54 #kalki movie, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : పాన్‌ ఇండియా స్టార్‌, టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రభాస్‌ తాజాగా నటించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాగ్‌అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక్కడ మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.91 కోట్లు) వసూలు చేసిందని సమాచారం. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రమూ అన్ని కోట్లను వసూలు చేయలేదట. మరోవైపు ఈ సినిమా విడుదలైన నాలుగురోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లను వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది.

కాగా, కల్కి మూవీలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశాపటాని, శోభన, రాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారు.

➡️