త్వరలో కాంతార- 2

May 23,2024 19:25 #movie, #rishab setty

కాంతార-2 పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను ఆ సినిమా హీరో రిషబ్‌ శెట్టి చురుగ్గా చేస్తున్నారు. ఇటీవలే ఆయన మలయాళ నటుడు మోహన్‌లాల్‌ను కలిశారు. కాంతార-2లో నటించమని అడగటానికే ఈ సమావేశం జరిగినట్టు వార్తలచ్చాయి. కాంతార 2 ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, సోషల్‌ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్‌ ఫ్యామిలీతో ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాసం నిర్వహించారు రిషబ్‌ దంపతులు. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.

➡️