దర్శకుడు విఘ్నేష్‌కి ఎల్‌ఐసి నోటీసులు

Jan 25,2024 13:07 #movie, #vignesh shivan

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కి ఎల్‌ఐసి (లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌) నోటీసులిచ్చింది. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ‘లవ్‌ టుడే’ మూవీలో హీరోగా నటించిన ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి లవ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్‌ వల్ల మూవీ దర్శక, నిర్మాతలు చిక్కుల్లో పడ్డారు. ఎల్‌ఐసి అనేది భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జీవిత బీమా సంస్థ. ఈ టైటిల్‌ తమ పేటెంట్‌ హక్కు అంటూ ఈ సంస్థ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌కి, నిర్మాత ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై చిత్రయూనిట్‌ ఎవరూ స్పందించలేదు. దీన్నిబట్టి ఈ మూవీకి ఎల్‌ఐసి అనే టైటిల్‌ని మార్చొచ్చు అని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

➡️