అందుకు మెగాస్టార్‌ పూర్తి అర్హుడు : విజయేంద్ర ప్రసాద్‌

Jan 23,2024 13:04 #movie, #Vijayendra Prasad

ఇంటర్నెట్‌డెస్క్‌ : అయోధ్యలో సోమవారం (జనవరి 22) జరిగిన రామ్‌లల్లా ప్రతిష్ట కార్యక్రమానికి టాలీవుడ్‌లో ఒక్క మెగాస్టార్‌ చిరంజీవికి మాత్రమే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ కథా రచయిత విజేయంద్రప్రసాద్‌ రామ్‌లల్లా ప్రతిష్ట ఆహ్వానికి చిరంజీవి పూర్తి అర్హుడు అని చెప్పారు. ఆయన ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి అగ్ర కథానాయకుడు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా టాలీవుడ్‌కు ఆయనే పెద్ద దిక్కు. ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానం చిరంజీవి గారిది అనడంలో సందేహం లేదు. కనుక అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి పూర్తి అర్హులు’ అంటూ విజయేంద్రప్రసాద్‌ అన్నారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

➡️