ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే

Nov 24,2023 13:16 #movie, #OTT

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : వారం.. వారం థియేటర్లలో సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. అలాగే బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేసిన సినిమాలు కొద్దిరోజులకే ఓటీటీలో విడుదలై నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ వారం శుక్రవారం (నవంబర్‌ 24) ఏ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయో తెలుసుకుందామా..!

భగవంత్‌ కేసరి

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. దసరాకి విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. శుక్రవారం ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

లియో

ప్రముఖ హీరో విజయ్ నటించిన తాజా మూవీ ‘లియో’. చాలాఏళ్ల తర్వాత విజయ్, ప్రముఖ హీరోయిన్‌ త్రిష కలిసి నటించిన చిత్రమిది. ఈ చిత్రం రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కూడా ఓటీటీ బాట పట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ది విలేజ్‌

తమిళ స్టార్‌ ఆర్య నటించిన వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’. ఈ సిరీస్‌ శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

➡️