‘ఆ ఒక్కటీ అడక్కు’ సెకండ్‌ సింగిల్‌

Apr 26,2024 19:20 #allari naresh, #movie

అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం మే 3న విడుదల కానుంది. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘హమ్మమ్మో’ను విడుదల చేశారు, ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. యశస్వి కొండేపూడి ఆలపించారు. వెన్నెల కిషోర్‌, జామీ లీవర్‌, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

➡️