మా అమ్మ ఎప్పటికీ నాతోనే వుండాలి: సాయి దుర్గతేజ్‌

సినిమా కెరీర్‌ ప్రారంభించినప్పటి నుండి నాకు మా అమ్మపేరు మీద ఓ నిర్మాణ సంస్థన ప్రారంభించాలని వుండేది. అందుకే అమ్మ పేరు మీద విజయదుర్గ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించి, దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాను. అమా అమ్మ ఎప్పుడూ నాతోనే వుండాలి. అందుకే ఇక నుంచి నా పేరును సాయి దుర్గతేజ్‌గా మార్చుకుంటున్నాను అని తెలిపారు.

సత్య సినిమా గురించి: దేశం కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను అర్పిస్తున్న సైనికులకు, వారి వెనుకున్న ఎందరో తల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళిగా.. మంచి కాన్సెప్ట్‌తో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు. ఇందులో సోల్జర్‌గా సాయిధరమ్‌ తేజ్‌ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్‌ స్వాతి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఈ వీడియోలో చక్కగా చూపించారు. ఓవైపు భార్యను ప్రేమిస్తూనే మరోవైపు దేశాన్ని కూడా ప్రేమిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించే సోల్జర్‌ పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ సాంగ్‌ను అంకితం ఇచ్చారు. సింగర్‌ శృతి రంజని ఈ పాటను కంపోజ్‌ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్‌ రాసి పాట పాడారు.

➡️