‘ఆయ్’ అంటున్న నార్నే

Mar 4,2024 19:58 #telugu movies

నితిన్‌ నార్నే నితిన్‌, నయన్‌ సారిక ప్రధాన పాత్రల్లో, అంజి కంచిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్‌ని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు డైరెక్టర్‌కు ఫోన్‌ చేసి టైటిల్‌ను అడగడం, తర్వాత అదే ఫోన్‌ కాల్‌లో హీరో, హీరోయిన్‌లు కూడా జాయిన్‌ అయిన వీడియోలో ‘ఆయ్’ అనే టైటిల్‌ని వినూత్నంగా ప్రకటించారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను మార్చి 7వ తేదీన రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గీతాఆర్ట్‌-2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

➡️